రోహిత్ రెడ్డికే ఓటు వేయాలి
– బీసీ సంఘం ఆధ్వర్యంలో జోరుగా ప్రచారం
– పాల్గొన్న బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికే ఓటు వేయాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. బీసీ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం యాలాల మండలం చెన్నారం, సంగెంఖుర్దు, దేవనూర్, జుంటుపల్లి, అక్కంపల్లి, గోరేపల్లి, పగిడిపల్లి తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ తాండూరులో గత దశాబ్ద కాలంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బీసీల కోసం పనిచేస్తున్నారని అన్నారు.
సంక్షేమంలో, రాజకీయాల్లో బీసీలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో పైలెట్ రోహిత్ రెడ్డికే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేష్, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, నాయకులు గడ్డం వెంకటేష్, హరి ప్రసాద్, రాము ముదిరాజ్, సోషల్ మీడియా ఇంచార్జ్ బస్వరాజు, యాలాల మాజీ వైస్ ఎంపీపీ అనంతయ్య, లాలు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

