బీఆర్ఎస్‌లో చేరికలే విజయానికి ప్రతీక
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– కారులో చేరిన యాలాల మండల బీజేపీ నేత
– కాంగ్రెస్ నుంచి కూడా నేతలు, కార్యకర్తలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీలో చేరికలు పార్టీ విజయానికి ప్రతీకగా నిలుస్తాయని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలం నుంచి బీజేపీ నేత రామ్యానాయక్, బషీరాబాద్ మండలంలోని క్యాధిరాకు చెందిన బీజేపీ నాయకులు, కోటపల్లి మండలం ఇందోల్, గుండ్ల మడుగు తాండా నుంచి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హాట్రిక్ సర్కారుగా ఏర్పాటు కాబోతుందన్నారు.
తాండూరులో కూడా రెండో సారి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి నాయకుల చేరికలే విజయానికి నిదర్శనంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్, మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఇది కూడా చదవండి…

