నిర్భయంగా ఓటేయండి..!
– పోలింగ్ బలగం అంతా సిద్ధం
– కేంద్రాలలో అన్ని పక్కాగా ఏర్పాట్లు
– వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక వాహనాలు
– తాండూరు ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటర్లు అందరు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తాండూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి, ఆర్డీఓ శ్రీనివాస్ రావు సూచించారు. మంగళవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ తాండూరులో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. 269 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 23 మంది సెక్టోరల్ అధికారులు, 23 మంది రూట్ ఆఫీసర్లు, 269 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు. అదనంగా 41 మంది అధికారులతో పాటు 269 మంది సహాయ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, వారికి అదనపు సహాయక అధికారులుగా 39 మందిని నియమించడం జరిగిందన్నారు. 54 మందితో సూక్ష్మ పరిశీలకుల బృందం, 173 మంది వెబ్ కాస్టింగ్ సిబ్బంది. 18 ప్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 10 స్టాటిస్టిక్స్ బృందాలు. ఒక వీడియో సర్వేలైన్ బృందం, ఒక వీడియో నీ వింగ్ బృందం. మరోక అకౌంటింగ్ బృందం. 155 మందితో పోలింగ్ నోడల్ అధికారుల బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
తాండూరులోని 269 పోలింగ్ కేంద్రాలలో ఒక మహిళ మోడల్ పోలింగ్ కేంద్రం. 5 మోడల్ పోలింగ్ కేంద్రాలు, 1 యూత్ మేనేజ్ డ్ పోలింగ్ కేంద్రం, 1 ప్రత్యేక అవసరాల గల పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 269 ఈవీఎం యంత్రాలు, అదనంగా 107 ఈవీఎం యంత్రాలను సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. బుధవారం ఉదంయ నుంచి తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ స్కూల్ నుంచి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాలలో తాగునీరు, విద్యుత్ ఇతర మౌళిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని వృద్ధులు, వికలాంగుల కోసం 155 పోలింగ్ ప్రాంతాలలో 155 వాహనాలను. ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వికలాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లను ఏర్పాటు చేయడం. జరిగిందని వివరించారు. రాజకీయ నాయకులు, పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రాలకు వాహనాలను ఉపయోగించరాదని హెచ్చరించారు.
నిర్భయంగా ఓటేయండి
ఈనెల 30వ తేదిన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు స్వేచ్చాయుత వాతావరణలో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా ఓటేయాలని సూచించారు. ఏమైనా సమస్యలు, ఫిర్యాదులు ఉంటే సీ విజిల్ యాప్ ను వినియోగించుకోవాలని, అందులో ఫిర్యాదులు చేస్తే 100 నిమిషాల్లో సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఆశపూరిత ప్రకటనలు నిషేధం
మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు, అభ్యర్థులు పత్రికల్లో, ప్రచార ప్రకటనలు ఇవ్వరాదన్నారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఎంసీఎంసీ అనుమతులు లేకుండా ప్రకటనలు వేస్తే చర్యలు తప్పవన్నారు. ముందుగా జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎవరైనా విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల కమీషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కావున ఏవైనా ఎన్నికలకు విఘాతం కలిగించడంతో పాటు ఆశ పూరిత ప్రకటనలు చేస్తే చర్యలు తప్పవన్నారు.
ఇది కూడా చదవండి…

