కోలుకొని అసెంబ్లీకి రండి..!
– మాజీ సీఎం కేసీఆర్ తో రేవంత్ రెడ్డి
– యశోదలో కెసిఆర్ ను పరామర్శించిన సీఎం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకొని అసెంబ్లీలో అడుగు పెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రెండు రోజుల క్రితం ఇంట్లో జారిపడి ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆదివారం యశోద ఆసుపత్రికి చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుమారుడు కేటీఆర్ అల్లుడు హరీష్ రావులను పరామర్శించి వైద్య శిబిలను ఆరా తీశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలని ప్రభుత్వానికి ఆయన సేవలు అవసరమని అన్నారు. ప్రజల పక్షాన ఆయన మాట్లాడవలసిన అవసరం ఉందని అన్నారు. ఆయనకు సక్రమమైన వైద్యసేవలను అందించాలని సి ఎస్ ను ఆదేశించినట్లు తెలిపారు. సీఎం వెంట మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ తదితరులు ఉన్నారు. మరోవైపు అంతకుముందే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు.
ఇది కూడా చదవండి…

