మనోహరన్నకు శుభాకాంక్షల వెల్లువ
– పుష్పగుచ్చాలు అందించిన నేతలు, అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. మంగళవారం తాండూరు పట్టణంలోని ఆయన సోదరుడు శ్రీనివాస్ రెడ్డి నివాసంలో పలువురు నేతలు, అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడం పట్ల పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు శాఖకు చెందిన పట్టణ ఎస్ఐ అబ్దుల్ రవూఫ్, కరణ్ కోట్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి, యాలాల ఎస్ఐ అరవింద్, పెద్దేముల్ ఎస్ఐ కాశినాథ్, బషీరాబాద్ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలోని వ్యవసాయ శాఖ అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీ గౌడ్, నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, అజయ్ ప్రసాద్, మహిపాల్ రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

