చలో నల్గొండకు తరలిన గులాబీ దళం

తాండూరు రాజకీయం వికారాబాద్

చలో నల్గొండకు తరలిన గులాబీ దళం
– తెలంగాణ హక్కుల పరిరక్షణ బీఆర్ఎస్ ధ్యేయం
– తాండూరు నుంచి ప్రత్యేక బస్సుల్లో వెళ్లిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర హక్కుల పరిరక్షణే బీఆర్ఎస్ పార్టీ ధ్యేయని ఆ పార్టీ తాండూరు నియోజకవర్గ నేతలు అన్నారు. కృష్ణాజలాలకు కేంద్రానికి అప్పగించడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు మంగళవారం చలో నల్గొండ కార్యక్రమం చేపట్టారు. మన నీళ్లు మనకే కావాలి, ప్రాజెక్టులపై ఇతరుల పెత్తనమేందని చేపట్టిన కార్యక్రమానికి తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాలతో తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు మండలం, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, నేతలు భారీగా బయల్దేరి వెళ్లారు. ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల్లో తరలివెళ్లారు.

తాండూరు పట్టణం నుంచి సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఇతర నాయకులు, తాండూరు మండలం నుంచి మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ పటేల్ ఉమాశంకర్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి, ఎంపీటీసీ వసంత్ కుమార్, శాంతు, రైతు సమితి కోఆర్డినేటర్ రాంలింగారెడ్డి, మాజీ సర్పంచులు రాజప్ప గౌడ్, ఎత్తరి రాములు, దశరథ్, నాయకులు వీరేందర్ రెడ్డి, మండల వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎం.ప్రకాష్, నూజీ సర్పంచ్ వెంకట్రాములు గౌడ్, బీసీ సెల్ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్, మాజీ ఉప సర్పంచులు జీవరత్నం, చిన్న మాధవరెడ్డి తదితరులు తరలివెళ్లారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మన నీళులు మనకే దక్కాలని బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చేందుకు కుట్ర చేస్తోందన్నారు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్యమానికి సిద్ధమయ్యిందన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను పరిరక్షించడే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. మరోవైపు చలో నల్గొండకు తరలే సమయంలో నేతలు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ, మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలకు అనుకూలంగా నినాదాలతో హోరెత్తించారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!