పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు

తాండూరు రాజకీయం వికారాబాద్

పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
– ప్రతి వార్డుకు సమానంగా కేటాయింపు
– మున్సిపల్ రూ.65.39 కోట్లతో అంచనా బడ్జెట్ ఆమోదం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతుందని, పట్టణంలోని అన్ని వార్డులకు సమానంగా ఈ నిధులను కేటాయించడం జరుగుతుందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన 2024-25 వార్షిక బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా, హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్ పై కౌన్సిలర్లతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 2024 ప్రారంభ నిల్వ రూ. 5.18 కోట్లతో 2024-25 అంచనా సాధారణ ఆధాయం రూ.25.64 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా అంచనా వ్యయం బడ్జెట్ కింద రూ.65.39 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టగా కౌన్సిలర్లందరు ఆమోదించడం జరిగిందన్నారు.

దీంతో పాటు టేబుల్ ఎజెండాలో మున్సిపల్ లో ఉన్న రూ. 4 కోట్ల నిధుల్లో ఒక్కో వార్డుకు రూ.10లక్షల చొప్పున 36 వార్డులకు సమానంగా పంచడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే గ్రాంటు కింద మరో రూ.4 కోట్ల నిధులను మంజూరు చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. ఈ రూ.4 కోట్ల నిధులకు సంబంధించి ప్రణాళికలు అందించాలని సూచించినట్లు వెల్లడించారు. వీటీతో పాటు మున్సిపల్ లో ఏ వార్డులో అయినా అత్యవసర పనులు చేపట్టాల్సి ఉంటే రూ. 50 లక్షల వరకు చైర్ పర్సన్ ఆమోదంతో పనులు చేపట్టే అధికారం కల్పించడం జరిగిందని స్పష్టం చేశారు. కావున కౌన్సిలర్లందరు తాండూరు పట్టణ అభివృద్ధికి పార్టీలకతీతంగా సహకరించాలని కోరారు. ప్రజల కోసం జవాబుదారి తనంలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. మరోవైపు వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని వార్డులో చేపట్టాల్సిన నీటి వసతులు.

ఇతర ప్రజల ఇబ్బందులపై దృష్టిసారించాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు. మాజీ వైస్ చైర్ పర్సన్ లు పట్లోళ్ల రత్నమాల నర్సింలు. సాజిద్ అలీ. ఆసిఫ్, ఫ్లోర్ లీడర్లు మధుబాల, అంతారం లలిత, సోమశేఖర్. కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్. అబ్దుల్ రజాక్, బోయరవి, వెంకన్న గౌడ్, విజయాదేవి, ఎర్రం వసంత, అశ్విని గుండప్ప, మంకాల రాఘవేందర్, భీంసింగ్, సాహు శ్రీలత, పూజ, సంగీత ఠాకూర్: సిందూజ గౌడ్, బాలప్ప, లావణ్య, సల్మా పాతిమా, మమత, ముక్తార్ నాజ్, వరాల శ్రీనివాస్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, వెంకట్రామ్ నాయక్, మునేజర్ నరేందర్ రెడ్డి, డీఈ ఖాజా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!