దత్తత్రేయుని సేవలో మున్సిపల్ చైర్ పర్సన్

తాండూరు రాజకీయం వికారాబాద్

దత్తత్రేయుని సేవలో మున్సిపల్ చైర్ పర్సన్
– దర్శించుకున్న ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గానుగాపూర్‌ దత్తాత్రేయ స్వామి సేవలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ కుటుంబాలు తరించాయి. శనివారం పౌర్ణమి సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ భర్త తాటికొండి పరిమళ్ గుప్త, విఠల్ నాయక్ కుటుంబ సభ్యులు సమేతంగా దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో వెలసిన స్వామి వార్లకు ఇరు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం స్వామి దర్శించుకుని పూజలు నిర్వహించినట్లు వారు తెలిపారు.

ఇది కూడా చదవండి..

సార్లు వస్తున్నారు..!