వారం కాకముందే వరుడు దుర్మరణం

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

వారం కాకముందే వరుడు దుర్మరణం
– పెళ్లి ఇంట తీరని విషాధం
– తాండూరు మండలం జినుగుర్తిలో ఘటన
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పెండ్లి జరిగి వారం కాకముందే వరుడు ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన పెండ్లి కుమారుడు, కూతురు ఇండ్లలో తీరని విషాధాన్ని నిపింది. బాధిత కుటుంబీకులు, కరన్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డిలు తెలిపిన వివరాలిలా ప్రకారం.. తాండూరు మండలం జినుగుర్తి తాండాకు చెందిన ముఢావత్ సురేష్‌(25)కు అదే మండలం పర్వతాపూర్ గ్రామానికి చెందిన అనితతో ఈనెల 3న అంగరంగ వైభవంగా వివాహాము జరిగింది.

కాగా సురేష్ కూలీ పనులు చేస్తూ జీనవం సాగిస్తున్నాడు. అయితే మంగళవారం పెండ్లి కొడుకు సురేష్‌ను అదే తాండాకు చెందిన కడావత్ సురేష్ అలియాస్ జూల్యా తన బైకుపై ఎక్కించుకుని బయటకు తీసుకెళ్లాడు. సాయంత్రం 6గంటల సమయంలో తిరిగి గ్రామానికి వస్తుండగా ఒక్కసారిగా వేగంతో బైకు అదుపు తప్పింది. ఈ క్రమంలో వెనుకాల కూర్చుకున్న పెండ్లి కొడుకు సురేష్ కిందపడిపోవడంతో తలకు, వీపు వెనుక భాగంగా తీవ్రగాయాలయ్యాయి. గమనించిన కుటుంభీకులు తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో బుధవారం సురేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెండ్లి జరిగిన 5వ రోజునే వరుడు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో తీరని విషాధం నిండింది. పెండ్లి కూతురు అనిత జూల్యాపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు.

ఇదికూడా చదవండి…

బాబోయ్…బావిలోకి దూసుకెళ్లిన కారు..!