
ఎండు ద్రాక్షలో ఎనర్జీ…!
– నీటిలో నానబెట్టి తీసుకుంటే మంచి ప్రయోజనాలు
– షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవాలా అంటే..?
దర్శిని డెస్క్ : ఎండు ద్రాక్ష.. డ్రై ఫూట్‌లో ఇదికూడా ఒకటి. పిల్లల నుండి వృద్ధుల వరకు ఎండు ద్రాక్ష ప్రతి ఒక్కరికీ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎవరైనా ఒక్కోసారి బలహీనంగా అనిపిస్తే ఈ పండ్లు తింటే ఫుల్ ఎనర్జీ లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
అంతేకాకుండా ఎవరికైనా తల తిరిగినట్లు అనిపిస్తే కూడా తీసుకంటే కూడా ఫలితం ఉంటుంది. ఎండు ద్రాక్షలో ఐరన్, పొటాషియం, ఫైబర్, విటమిన్-సి, బి6 వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎండుద్రాక్షలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.
అందుకే ఎండుద్రాక్షలు తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందడమే కాకుండా రోజంగా ఉత్సాహంగా ఉంటారు. ఎండు ద్రాక్ష తినడం వల్ల బలహీనత, తల తిరగడం మాత్రమే కాకుండా అనేక ఇతర వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. ఎండుద్రాక్ష హిమోగ్లోబిన్ తయారీలో సహాయపడుతుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు ప్రతిరోజూ కనీసం 4-5 ఎండు ద్రాక్షలను తినాలి.

ఎండుద్రాక్షను ఒక కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఆ నానబెట్టిన ఎండుద్రాక్షను తినడంతోపాటు.. ఎండుద్రాక్ష నానబెట్టిన నీటిని తాగడం ద్వారా కూడా మరిన్ని ప్రయోజనాలను పొందుతారు. రోజూ 4-10 ఎండు ద్రాక్షలు తినాలి. అయితే ఎండుద్రాక్షలో చక్కెరలు ఉంటాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎండుద్రాక్ష తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

ఇదికూడా చదవండి…

