స్పూర్తి దాయకులు డా.బాబు జగ్జీవన్ రామ్
– తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– మున్సిపల్ కార్యాలయంలో వర్థంతి నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత స్వాతంత్ర సమర యోధుడు, భారత మాజీ ఉప ప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ స్పూర్తి దాయకుడు అని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో డా.బాబు జగ్జీవన్ రామ్ వర్దంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కార్యాలయ ఉద్యోగులతో కలిసి డా.బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ దేశాభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. బాబూజీగా ప్రసిద్ది చెందిన జగ్జీవన్ రామ్ అంటరానివారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అంతేకాదు భారతదేశంలో హరిత విప్లవం, భారత వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమన్నారు. ఆ మమహనీయుడి స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగులు, ఆర్పీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి….

