వానల ముప్పుతో జర పైలం
– తాగునీటికి కలుషితంకు అస్కారం
– అందరు జాగ్రత్తలు పాటించాలి
– తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారీ వర్షాల ముప్పు ఇంకా తగ్గలేదని, ప్రజలందరు జర పైలంగా ఉండాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి సూచించారు. మంగళవారం పట్టణంలోని మల్ రెడ్డి పల్లి సమీపంలో ఉన్న చెరువును శానిటేషన్ సిబ్బందితో కలిసి సందర్శించారు. చెరువు సమీప ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరులో భారీ వర్షాలు కురిశాయని, కొత్త నీరుతో తాగునీరు కలుషితం అయ్యే అస్కారం ఉందన్నారు. ప్రజలు తాగునీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.
కొత్త నీరు వస్తున్నందున రోగాలు ప్రభలే అవకాశం ఉందని హెచ్చరించారు. కావున తాగునీటికి కాచి వడబోసుకుని తాగాలని సూచించారు. అదేవిధంగా చెరువులు, వాగుల వద్దకు ఎవ్వరు రావద్దని అన్నారు. చిన్నారులు ప్రవహించే వాగుల వద్దకు వెళ్లకుండా చూడాలన్నారు. చెరువుల వద్ద రీల్స్ కోసం వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. మరోవైపు వచ్చే వినాయక చవితి ఉత్సవాలలో అందరు మట్టి వినాయకులను ప్రతిష్టించాలని సూచించారు. వాగుల్లో, చెరువుల్లో నీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. పండగను ప్రశాంతంగా జరుపుకునేందుకు అందరు సహకరించాలన్నారు. కమీషనర్ వెంట శానిటరీ ఇను స్పెక్టర్ వెంకటయ్య, జవాన్లు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

