విద్యార్థులతో ఆనంద్ సబ్‌కేలియే జోష్..!
– మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో దీపావళీ సంబరాలు
– మురిసిపోయిన విద్యార్థినిలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆనంద్ సబ్ కేలీయే పేరుతో తాండూరు మార్వాడీ యువమంచ్ పేద విద్యార్థుల్లో జోష్ నింపింది. దీపావళీ పండగను పురస్కరించుకుని మార్వాడి యువమంచ్ ప్రతి యేడాది నిర్వహిస్తున్న ఆనంద్ సబ్ కే లీయే ఉత్సవాలను సోమవారం బషీరాబాద్ మండలం కేజీబీవి బాలికల పాఠశాలలో ముందస్తు దీపావళిని ఉత్సహంగా జరుపుకున్నారు.

మంచ్ సభ్యులు విద్యార్థులతో కలిసి టపాసులు, బాణాసంచాలు పేలుస్తూ ఆనందాన్ని పంచి పెట్టారు. అనంతరం విద్యార్థులకు కరిపఫ్, పేస్ట్రీ, చిప్స్, స్వీట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మనహన్ సార్డా మాట్లాడుతూ కేజీబీవీలో విద్యార్థినిల కోసం లైబ్రరీ పుస్తకాలను అందించేందుకు కృషి చేస్తామన్నారు. విద్యార్థులతో కలిసి ముందస్తు దీపావళీ సంబరాలు జరుపుకోవడం సంతో షంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సుధాకర్‌రెడ్డి, మంచ్ అధ్యక్షులు అనిల్ సార్ధా, కార్యదర్శి సచిన్ రాఠీ, కోశాధికారి అరుణ్ సార్డా, నిహార్ సోమాని, పవన్ సోని, దీనేష్ పర్తాని, రోహిత్ అగ్రవాల్, సునీల్ సార్డా, గుడ్డు బూబ్, రమాకాంత్ పండిత్, ఆశీష్ సార్థా, కిషన్ బూబ్, శ్రీకాంత్ సార్డా, ప్రిన్సిపల్ సునంద, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు వెంకట్ రాంరెడ్డి, మండల అధ్యక్షులు నర్సింహారెడ్డి, రవీందర్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

