ఇంటింటి సర్వేకు మున్సిపల్ సిద్దం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఇంటింటి సర్వేకు మున్సిపల్ సిద్దం..!
– ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లకు లక్ష్యం
– పరిశీలించిన సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్
– సర్వేతీరును వివరించిన కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే కోసం తాండూరు మున్సిపల్ యంత్రాంగం సిద్దమయ్యిందె ఈనెల 6వ తేది నుంచి నిర్వహించే సర్వే కోసం ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్ల నియామకం, శిక్షణ దాదాపు పూర్తయ్యింది. సర్వే కోసం తాండూరు మున్సిపల్ పరిధిలో ఉన్న 36 వార్డులలో వార్డుకు 4 బ్లాకుల చొప్పున 145 బ్లాకులుగా విభజించారు. ఒక్కో బ్లాకుకు ఒక్కో ఎన్యూమరేటర్ ను నియమించారు. 8నుంచి 12 బ్లాకులతో ఏర్పాటు చేసే ఒక్కో దానికి 1 సూపర్ వైజర్ ను నియమించగా దాదాపు 15 మంది సూపర్ వైజర్లను నియమించారు. ఇందులో ఉపాధ్యాయులు, ఆర్పీలు ఉంటారని అన్నారు. శనివారం తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు.

సర్వేలో పాల్గొనే ఎన్యుమరె టర్లు, సూపర్ వైజర్ల నియామకాల గురించి ఆరా తీశారు. సిబ్బంది లోటు ఏమైనా ఉందా, ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని కమీషనర్ విక్రమ్ సిం హారెడ్డితో ఆరా తీశారు. అయితే ఒక్కో బ్లాకులో 150 ఇండ్లు సర్వే చేయాల్సి ఉండగా పట్టణంలో ఒక బ్లాకులో 150 తక్కువగా ఇండ్లు ఉంటే మరో బ్లాకులో 150కి ఎక్కువగా ఇండ్లు ఉన్నాయని సిబ్బంది సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకవచ్చారు. దీనిని సవరించేలా చూడాలని కోరారు. ఇందుకు సబ్ కలెక్టర్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డికి సవరణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి మాట్లాడుతూ ఈనెల 6నుంచి జరిగే ఇంటింటి సరే మొత్తం 3దశలలో చేపట్టి.. నాలుగో దశలో ఆన్ లైన్ చేయడం జరుగుతుందని వెల్లడించారు.

ముందుగా ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటిస్తారని తెలిపారు. ఆ తరువాత రెండు దశల్లో సూపర్ వైజర్లు సర్వే వివరాలను నమోదు చేస్తారని వివరించారు. పట్టణంలో చేపట్టే సర్వేకు అందరు సహకరించాలని కొ రారు. ఈ కార్యక్రమంలో తాండూరు తహసీల్దార్ తారాసింగ్, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ఆర్బీఓఎల్‌లో ఆనందాల దీపావళీ..!