తెలంగాణ జాగృతికి పూర్వవైభవం తెస్తాం..!
– అధ్యక్షురాలు కవితక్కను కలిసిన తాండూరు నేతలు
– రాష్ట్ర స్థాయి సమావేశంలో హాజరై.. సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ జాగృతిలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు సంస్థకు పూర్వ వైభవం తీసుకవచ్చేలా కృషి చేస్తామని తాండూరు నాయకులు శకుంతల దేశ్‌పాండే, దత్తాత్రేయ రావులు అన్నారు. కవితక్క తన నివాసంలో జరిగిన జాగృతి రాష్ట్ర స్థాయి సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ నేతలు, సభ్యులలో నూతనోత్సహం నింపారు. జాగృతి ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలతో పాటు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కమిటీల ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాకుండా మీడియా, విద్యార్థి కమిటీలను వేయాలన్నారు. సమర్ట్ విటీ, స్ట్రీట్ విటీ అనే కార్యక్రమంపై దృష్టిసారించాలని సూచించారు. ఈ సందర్బంగా శకుంతల దేశ్ పాండే, దత్తాత్రేయరావులు మాట్లడుతూ జాగృతి అధ్యక్షురాలు కవితక్క ఇచ్చిన పిలుపు మేరకు జాగృతికి పూర్వ వైభవం తీసుకవచ్చేలా కృషి చేస్తామన్నారు. కవితక్కను సన్మానించి.. ఆమెను కలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కన్వినర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి….

