శ్రీవారి కృప అందరిపై ఉండాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

శ్రీవారి కృప అందరిపై ఉండాలి
– ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి
– దస్తగిరిపేట్ లో వైకుంఠ ఏకాదశి దర్శనం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : శ్రీవారి కృప అందరిపై ఉండాలని తాండూరు ఆర్బీఓఎల్‌ ఎండీ బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్‌లో వెలసిన శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆమె ముక్కోటి వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్, నాయకులు బాతుల వెంకటయ్య, కావలి సంతోష్‌ కుమార్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి….

దస్తగిరిపేట్‌కు ముక్కోటి శోభ..!