పోలీసు జట్టు మెరుపులు.. ప్రెస్ జట్టు ఉరుములు..!
– ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ట్రోఫీ పోలీసులదే
– రన్నర్‌గా నిలిచిన ప్రెస్ జట్టు
– ఉత్సహంగా పోలీసు, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పోలీసు, ప్రెస్ మద్య ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో పోలీసు జట్టు మెరుపులు మెరిపిస్తే అందుకు ధీటుగా ప్రెస్ జట్టు ఉరుములతో ఉడికించింది. ప్రతి యేడాది మాదిరిగానే ఈసారి పోలీసు, ప్రెస్ మద్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఉత్సహంగా జరిగింది. ఆదివారం పెద్దేముల్ మండలం ఇందూరులోని ఓ మైదానంలో తాండూరు డివిజన్ లోని పోలీసు, ప్రెస్ జట్ల మద్య క్రికెట్ పోటీ నిర్వహించారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇరు జట్ల మద్య 16 ఓవర్లతో మ్యాచ్ ను ప్రారంభించారు. ముందుగా పోలీసు జట్టు టాస్ గెలిచి బ్యాంటింగ్ దిగింది. పోలీసు జట్టుగా కెప్షన్ గా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, ప్రెస్ జట్టుకు డి. రామకృష్ణలు కెప్టెన్లుగా వ్యవహరించారు.

మొత్తం 16 ఓవర్లలో పోలీసు జట్టు 6 వికెట్లను కోల్పోయి 182 పరుగులు సాధించింది. ఫోర్లు, సిక్సులతో పోలీసు క్రీడాకారులు మెరుపులు మెరిపించారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ప్రెస్ జట్టు మొదటి నుంచి దూకుడు ప్రదర్శిస్తూ ఉరుములతో ఉడికిచింది. అవసరమైనప్పుడల్లా ఫోర్లు, సిక్సులతో ఉత్కంఠతను పెంచింది. చివవరకు 7 వికెట్లను కోల్పోయి 134 పరుగులు సాధించింది. పోలీసు జట్టులో ఒక వికెట్ తో పాటు 64 పరుగులు చేసిన చేసిన నగేష్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. ప్రెస్ జట్టులో నరేష్ బెస్ట్ బ్యాట్స్ మెన్, రవి బెస్ట్ బౌలర్, ముక్తార్ బెస్ట్ ఫీల్డర్, నవీన్‌లు నిలిచారు.

విజేత, రన్నర్ లుగా నిలిచిన జట్లకు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేష్, సీనీయర్ జర్నలిస్టులువేణుగోపాల్ రెడ్డి, వాసు, లింగేష్, భీం సేన్ రావు, రాంచెందర్ లు ట్రోఫీ, మెమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసులు, ప్రెస్ మద్య స్నేహ సంబంధాలు కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. పోటీల్లో గెలుపు, ఓటములు సహజమేనని అన్నారు. ఓడిన జట్టు గెలిచే ప్రయత్నాలు చేయాలన్నారు. అదేవిధంగా క్రికెట్ మ్యాచ్ కోసం ఏర్పాట్లు చేసిన ఇందూరు నిర్వహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

