బీసీ జాతీయ స్థాయి ఉద్యమానికి సిద్ధంకండి
– బీసీల ఉద్యమం తాండూరు నుంచే మొదలైంది
– ఢిల్లీలో నిరసనకు భారీగా తరలిరావాలి
– రాజ్యసభ సభ్యులు, జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య
తాండూరు, దర్శిని ప్రతినిధి : జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న బీసీల ఉద్యమానికి బీసీలు అందరు సిద్ధం కావాలని, ఢీల్లిలో నిర్వహిస్తున్న నిరసనకు భారీ ఎత్తున తరలిరావాలని రాజ్యసభ్య సభ్యులు, సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్ ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గ బీసీ మహిళ సంఘం నాయకులు ఆర్. కృష్ణయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆర్. కృష్ణయ్యను శాలువా, పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ 50 ఏండ్ల క్రితం తాండూరు నియోజకవర్గం నుంచే బీసీల అభివృద్ధి కోసం ఉద్యమం మొదలైందని గుర్తుచేశారు. ఉద్యమాలతోనే బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాలలో అభివృద్ధిని సాధించుకున్నామన్నారు. ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి ఉద్యమానికి బీసీలు సిద్ధంగా ఉండాలని, తాండూరు నుంచి నేతలు భారీ ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారి, తాండూరు అధ్యక్షురాలు అనిత, ఉపాధ్యక్షురాలు మంజుల, నర్సమ్మ, కార్యదర్శి జగదీశ్వరి, యాలాల మండల అధ్యక్షులు లక్ష్మణ్ చారి, నాయకులు శ్రీనివాస్, అరుణ్ రాజ్, విజయ్ కుమార్, ఫయాజ్ రాములు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

