బాలుడికి బుయ్యని చేయూత..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బాలుడికి బుయ్యని చేయూత..!
– చికిత్సకు రూ. 50వేలు అందించిన శ్రీనివాస్ రెడ్డి
– మరోసారి మానవత్వం చాటుకున్న నేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. మెటబాలిక్ డిజార్డర్ తో బాధపడుతున్న 7నెలల చిన్నారికి తాండూరు చేయూత అందించారు. మంగళవారం బాలుడి చికిత్స కోసం రూ.50వేల చెక్కును అందజేశారు.

తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన మాధవి, సాయికుమార్ దంపతుల కుమారుడు ఉత్కర్షె(7నెలలు) గత కొన్ని రోజుల నుంచి మెటబాలిక్ డిజార్డర్ తో బాధపడుతున్నారు. రోజూ బాలుడి వైద్యానికి రూ.30 నుంచి 40వేల వరకు ఖర్చు అవుతున్నట్లు కుటుంభీకులు తెలిపారు. పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు బాలుడికి చికిత్స చేయించడంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. బాలుడి చికిత్స కోసం రూ. 50వేల చెక్కును అందజేశారు. బాలుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా అందించారు. దాతలు బాలుడు చికిత్స కోసం సహాకారం అందించాలని సూచించారు. మరోవైపు శ్రీనివాస్ రెడ్డి అందించిన సాయానికి కుటుంభీకులు కృతజ్ఞతలు తెలిపారు. బాలుడి వైద్యానికి ఇంకా ఖర్చులు అవసరమవుతాయని, ఎవరైనా సాయం అందించాలనుకుంటే బాలుడి తండ్రి సాయికుమార్ సెల్: 8106152638కు ఆన్ లైన్ ద్వారా సాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త పర్యాద రామకృష్ణ, యువ నాయకులు లోకేష్ కుమార్, చందు తదితరులు ఉన్నారు. మరోవైపు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఇటీవల అరుదైన కాలేయే వ్యాధితో బాధపడుతున్న వశిష్ట చిన్నారి ఆపరేషన్ కోసం చేయూత అందించారు. మరోసారి బాలుడి కోసం చేయూత అందించడం పట్ల ఆయన నేతలు, అభిమానులు శ్రీనివాస్ రెడ్డి గొప్ప మనసును కొనియాడుతున్నారు.

ఇది కూడా చదవండి….

బీఆర్ఎస్ రజతోత్సవం భారీ రికార్డ్..!