మున్సిపల్‌ కార్మికులకు ఫించన్‌..!

జాతీయం తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

మున్సిపల్‌ కార్మికులకు ఫించన్‌..!
– రూ. 5లక్షల వరకు ఉచిత వైద్యం
– కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
– నమస్తే యాప్‌ను ప్రవేశ పెట్టిన కేంద్రం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : పారిశుద్ధ్య కార్మికులకు ఫించన్‌ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని జిల్లాలలో అమలు చేస్తున్న కొత్త పథకాన్ని అంతటా అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల కోసం ‘జాతీయ యాంత్రీక పారిశుద్ధ్య పర్యావరణ వ్యవస్థ(న మస్తే)’ పథకాన్ని ప్రవేశపెట్టింది.

మున్సిపల్ ప్రాంతాల్లో అర్హులైన కార్మికులను గుర్తించి, వారి వివరాలను ‘నమస్తే’ యాప్ లో నమోదు చేయనున్నారు. మరుగుదొడ్ల వ్యర్ధా లు తొలగించే కార్మికులు, సెప్టిక్ ట్యాంకులు, మురుగు కాలువలు, మ్యాన్హాల్స్ శుభ్రపరిచే కార్మికులు, చెత్త సేకరించేవారు ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు.

నమోదైన కార్మికులకు భవిష్యత్తు లో కేంద్ర ప్రభుత్వం పించన్, ఆర్థికసాయం అందించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నమస్తే యాప్‌లో నమోదైన కార్మికలకు ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం. సబ్సీడీ ద్వారా పారిశుద్ధ్య వాహానాల కొనుగోలుకు అవకాశం కల్పించను్నారు. అంతేకాకుండా కార్మికుల పిల్లల విద్యకు ఆర్థిక సహాయం అందించనున్నారు. అవసరమైతే ప్రత్యామ్నాయ జీవనోపా ధి కల్పించడం ద్వారా కార్మిక కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకోనుంది.

కార్మికుల భద్రత, గౌరవం, సురక్షితమైన పని వాతావరణం కల్పించడంతోపాటు, ప్రత్యేక పరికరాలు అం దించడం, ఆధునిక సురక్షిత పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం, ప్రత్యా మ్నాయ జీవనో పాధి కల్పించడం ఈ పథకం లక్ష్యాలు. గుర్తించిన కార్మికులకు ఆరోగ్య కిట్లు అందజేయడంతోపాటు, యం త్రాల వినియోగాన్ని ప్రోత్సహించే చర్యలు చేపడ తారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఎప్పటిక ప్పుడు వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. కేంద్రం ప్రవేశ పెట్టిన నమస్తే యాప్ కార్మికులకు వరంగా మారనుంది.

ఇదికూడా చదవండి…

మురుగుకు మోక్షం..!