ఉలిక్కిపడిన తాండాలు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్


ఉలిక్కిపడిన తాండాలు..!

– భూమి కంపించేలా భారీ శబ్దాలు
– రాత్రంతా బయట నిద్రించిన జనాలు
– పెద్దేముల్ మండలంలో కలకలం
– ఆ తాండాలలో అసలేం జరిగింది..?
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : వికారారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలోని పల్లెలు ఉలిక్కిపడ్డాయి. మండలంలోని తాండాలు, ఓ గ్రామం సోమవారం రాత్రి ఇండ్లలో నుంచి బయటకు వచ్చి నిద్రించారు.

ఈ సంఘటన పెద్దేముల్ మండలంలో కలకలం రేపింది. మండలంలోని సిద్దన్న మడుగు తాండా, ఆత్కూర్, ఎర్రగడ్డ తాండాలో సోమవారం రాత్రి నుంచి పేలుళ్లు, భూమి కంపించే శబ్దాలు వినిపించినట్లు గ్రామస్తులు తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి మంగళవారం ఉదయం వరకు ఈ శబ్దాలు వినిపించాయని చెప్పారు.

రాత్రి నుంచి భారీ శబ్దాలు వి నిపించడంతో పాటు భూమి కంపించినట్లు అనిపించిదని భయాందోళన వ్యక్తం చేశారు. ఎర్రగడ్డ తాండాతో పాటు సిద్దన్నమడుగు తాండాలో ప్రజలు రాత్రంతా ఇండ్లలో నుంచి బయటకు వచ్చారని, ఆరు బయటే పడుకున్నామని తెలిపారు. అయితే తాండాల పరిసర ప్రాంతాలలో జరీనా స్టోన్ వ్యాపారస్తులు చెందిన గనులు ఉన్నాయని, ఈ గనుల్లో బ్లాస్టింగ్ లు జరుపుతారని గుర్తుచేశారు.

కాని భారీ శబ్దాలకు, తమకు సంబంధం లేదని వారు చెప్పడంతో మరింత భయాందోళన చెందామని అన్నారు. భూకంపమే వచ్చిందా లేదా మరేమైనా జరిగిందా అని అనుమానాలను వ్యక్తం చె శారు. మరోవైపు మంగళవారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న పెద్దేముల్ పోలీస్టేషన్ సిబ్బంది తాండాలను సందరి ంచారు. అధికారుల దర్యాప్తు తరువాతే ఏంజరిగిందనే వివరాలు తెలుస్తాయేమో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెద్దేముల్ మండలంలో భారీ శబ్దాల సంఘటన కలకలం రేపడంతో పాటు చర్చనీయాంశంగా మారింది.

ఇదికూడా చదవండి..

అభివృద్దే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ధ్యేయం