యువకుడి కుటుంబానికి ఆర్థిక సాయం
– అనుచరుల ద్వారా అందించిన ఏఎంసీ చైర్మన్ బాల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు.

తాండూరు మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన చింతలకాడి దత్తు(17) ఆటో బొల్తా కొట్టిన ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. గురువారం తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ బాల్ రెడ్డి మృతి చెందిన యువకుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.

చంద్రవంచ గ్రామానికి చెందిన శివాజీ యువజన సంఘం ద్వారా కుటుంబానికి అందజేశారు. యువకుడి కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని బాల్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిట్టిఘనాపూర్ గ్రామానికి చెందిన నాయకులు వై ప్రభాకర్ రెడ్డి, పిశాంత్ కుమార్, కె వెంకటేశం, యువజన సంఘం సభ్యులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

