తాండూరు మండల సర్పంచులకు సన్మానం

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు మండల సర్పంచులకు సన్మానం
– పాల్గొని సత్కరించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– చిట్టిగణాపూర్ బండపల్లి శివ శరణప్ప ఆధ్వర్యంలో కార్యక్రమం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం చిట్టిగణాపూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం, తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు, తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ ముఖ్య సలహాదారులు, విశ్వలింగాయత్ ట్రస్ట్ సలహాదారులు, రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు గ్రహీత బండపల్లి శివ శరణప్ప ఆధ్వర్యంలో బుధవారం రాత్రి తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో చిట్టిగణాపూర్ సర్పంచ్ పటేల్ విజయ్ కుమార్, పాలకవర్గంతో పాటు అన్ని గ్రామాల సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సర్పంచులను శివ శరణప్పతో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశ్రాంత ఉపాధ్యాయుడు శివ శరణప్ప మంచి మనసుతో సర్పంచులు తన గ్రామ పాలకవర్గం సభ్యులను సన్మానించేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికలలో గెలిచిన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి బాధ్యతగా కృషి చేయాలన్నారు. పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలి తప్పా.. గెలిచిన అనంతరం అందరిని కలుపుకుని ముందుకు సాగాలని అన్నారు.

గ్రామాల అభివృద్ధికి తన వంతు సహాకారం అందిస్తామని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహాకారంతో నియోజకవర్గంలోని గ్రామాలను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి, డీసీసీబీ జిల్లా మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మండల పార్టీ అధ్యక్షులు జన్నె నాగప్ప, పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ ఎంపీపీ శరణు బసప్ప, నేతలు ప్రభాకర్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ రెడ్డి, సర్పంచులు రాజ్ కుమార్, పటేల్ విజయ్ కుమార్, సుదర్శన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ గౌడ్, పలువురు మహిళ సర్పంచులు. నేతలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

 

అంతారం తాండా సర్పంచుకు ఎమ్మెల్యే పరామర్శ