బోనమెత్తిన తాండూరు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బోనమెత్తిన తాండూరు..!
– ధూమ్ ధామ్ గా ఆషాఢం ఉత్సవాలు
– కాళికా దేవి ఆలయంలో అమ్మవారికి వైభవంగా పూజలు
– ఆదర్శనగర్ లో కట్ట మైసమ్మకు మొక్కలు
– మొక్కు చెల్లించిన చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి
– గాంధీనగర్ లో ఘనంగా సంబరాలు
– సందడి చేసిన ఆర్బీఓఎల్ శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆషాఢం మాసం జాతర ఉత్సవాలు తాండూరు పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగాయి.

ఆదివారం పట్టణంలో అమ్మవార్ల ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆషాఢం మాసంను పురస్కరించుకుని తాండూరు భక్తులు బోనాలను ఎత్తుకున్నారు. పట్టణంలోని కాళికా దేవి ఆలయంలో ఈఓ  నరేందర్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది మాదిరిగానే బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు.

జాతర సందర్భంగా ఆలయంలో వెలసిన అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణలు చేశారు. ఉదయం నుంచి భక్తులు దేవాలయానికి పోటెత్తారు. అదేవిధంగా ఆదర్శనగర్ లో కట్ట మైసమ్మ ఆలయంలో కూడా బోనాల పండుగ అంగరంగా వైభవంగా నిర్వహించారు. దేవాలయంలో వెలసిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు.

మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ కుటుంబ సభ్యులు కూడా అమ్మవారికి బోనం సమర్పించారు. అదేవిధంగా పట్టణంలోని గాంధీనగర్ లో కట్ట మైసమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ నవీన సంతోష్ గౌడ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢం సందర్భంగా కాలనీ మహిళలు, భక్తులు బోనాలతో ఊరేగింపుగా వచ్చి నైవేద్యాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు.

మరోవైపు ఆషాఢం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని తాండూరు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి దేవాలయాలను సందర్శించారు. కాళికా దేవి ఆలయం, గాంధీనగర్ కట్టమైసమ్మ దేవాలయం, మల్ రెడ్డి లోని అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆయన వెంట కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. గాంధీనగర్ లో అమ్మవారిని మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు దర్శించుకున్నారు. బోనాల సంబరాలతో తాండూరు మొత్తం ఆషాఢం శోభ సంతరించుకుంది.

విద్యార్థుల మధ్య ఘర్షణ దురదృష్టకరం..!