తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు..!
– ఘనంగా జీవన్ దాత వందన ఉత్సవం
– మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో పాదపూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అని తాండూరు మార్వాడి యువమంచ్ సభ్యులు స్పూర్తి సందేశాన్ని అందించారు.

మార్వాడీ యువ మంచ్ తాండూరు శాఖ ఆధ్వర్యంలో జాతీయ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ‘జీవన్ దాత వందన ఉత్సవం’ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బాలాజీ మందిర సభా గృహంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంచ్‌కు చెందిన 50 మంది సభ్యులు తమ తల్లిదండ్రులకు పాదపూజ చేసి ఘనంగా సన్మానించారు.

పెద్దలను ఎల్లప్పుడూ గౌరవించాలని, కుటుంబ విలువలను కాపాడుతూ సమాజంలో అందరూ ఐకమత్యంతో కలిసి మెలిసి ఉండాలనే సందేశాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచ్ అధ్యక్షులు కిషన్ రాఠి, కార్యదర్శి కరణ్ జైన్, అనిల్ సార్డా, కుంజ్ బిహారీ సోనీ, అరుణ్ సార్డా, దీపక్ గగ్రాని, మహేష్ సార్డా, శ్రీకాంత్ సార్డా, లక్ష్మీ నారాయణ బూబ్, మధు సోనీ, సన్నీ అగర్వాల్, రమాకాంత్ పండిట్, నితిన్ సార్డాతో పాటు సమాజ పెద్దలు, మహిళా మండలి సభ్యులు, మంచ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తిరంగా రెప రెపలు..!