మా నాయకులపై నోరుజారితే.. ఖబడ్దార్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మా నాయకులపై నోరుజారితే.. ఖబడ్దార్..!
– బీఆర్ఎస్ యువ నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలి 
– భద్రేశ్వర దేవాలయ మాజీ చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మా నాయకులు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డిలపై మరోసారి నోరుజారితే ఖబడ్దార్ అంటూ భద్రేశ్వర దేవాలయ రెనవేషన్‌ కమిటి మాజీ చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్ బీఆర్ఎస్ యువనాయకులను హెచ్చరించారు.

సోమవారం తాండూరుకు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రాక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు అనిల్ బాండ్ చేసిన వాఖ్యలను ఖండించారు. దీనిపై పటేల్ కిరణ్‌ కుమార్ మాట్లాడుతూ ఖబడ్దార్ అనిల్ అంటూ హెచ్చరించారు.

ఎమ్మెల్యే, సోదరుడిపై అసభ్య పదజాలంను సహించేది లేదని అన్నారు. వాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాండూరులో ప్రశాంత వాతావరణాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

తాండూరు ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రౌడియిజాలకు పాల్పడితే ఎవ్వరు సహించరని అన్నారు. మా నాయకులపై చేసిన వాఖ్యలకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని, లేదంటే తీవ్ర పరిణమాలు తప్పవని హెచ్చరించారు.

పైలెట్ కి యమక్రేజ్..!