గణనాథుని సేవలో శంకర్ యాదవ్
– మండపాలను సందర్శించి పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వినాయక చవితి సందర్భంగా మండపాలలో కొలువుదీరిన గణనాథుల సేవలో తాండూరుకు చెందిన శ్రీ సాయిపుత్ర హోమ్స్, డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ తరించారు. శుక్రవారం పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ఆయన సందర్శించారు. ఆయా మండపాల్లో కొలువు దీరిన గణనాథులను కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. తాండూరు నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో.. సుభిక్షంగా మెలగాలని వినాయకున్ని వేడుకున్నారు. ఆయన వెంట మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బీసీ సంఘం కన్వినర్ కుందుకూరి రాజ్ కుమార్, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు బంటు మల్లప్ప, ప్రేమ్ కుమార్ తదితరులు ఉన్నారు.
