పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ..!
– తాండూరు శిశు మందిదర్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : పాఠశాలలో చదువుకుని 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకున్నారు. తాండూరుకు చెందిన శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల 1995 -96 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఈ ఆత్మీయ సమ్మేళనంను ఉత్సహాంగా జరుపుకున్నారు. ఆదివారం పట్టణంలోని శ్రీ దుర్గా గ్రాండ్యూయర్ బ్యాంకెట్ హాల్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు అందరు ఒకేచోట కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆనాటి మధుర స్మృతులు పంచుకొని ఎంతో ఉత్సాహంగా గడిపారు. అదేవిధంగా అప్పటి ప్రధానాచారి శ్రీ రామ్ రెడ్డి గారు, సరస్వతీ విద్యా పీఠం ప్రస్తుత వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీ మల్లేశం గారు మరియు అప్పటి ఆచార్యులు, 20 మంది మాతాజీలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 60 మందికి పైగా పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. సుమారు 27 సంవత్సరాల తరువాత ఇలా కలవడం ఎంతో ఆనందంగా ఉందని ఆచార్యులు, మాతాజీలు మరియు విద్యార్థులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఇక ముందు కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం కలవాలని మరియు తమ పాఠశాల అభివృద్ధికి భవిష్యత్తులో అన్ని రకాలుగా సహాయపడటానికి సిద్ధంగా ఉంటామని అందరూ నిర్ణయo తీసుకోవడం జరిగింది.
ఇది కూడా చదవండి…


