బీసీలను కాదంటే ఊరుకోం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీసీలను కాదంటే ఊరుకోం..!
– కాంగ్రెస్ టికెట్ రమేష్‌ మహారాజ్‌కే ఇవ్వాలి
– కేఎల్‌ఆర్‌కు ఇస్తే బీసీల గుణపాఠం తప్పదు
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్‌ను బీసీలకు కాదనకుండా ఇస్తే ఊరుకునేది లేదని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ తాండూరు కాంగ్రెస్ టికెట్‌ను కేఎల్ఆర్‌కు ఇస్తున్నట్లు వచ్చిన ప్రచారాన్ని కొట్టిపారేశారు. తాండూరు ప్రజలకు ముక్కు.. ముఖం తెలియని ఆయనకు టికెట్ ఇవ్వడంలో అర్థం లేదన్నారు. గత దశాబ్దాలుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహరాజుల కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తుందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. పార్టీని భుజస్కంధాల పై మోసుకుని కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.

ఎన్నికల సమయంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హైడ్రామాకు తెరలేపుతున్నారని విమర్శించారు. తాండూరు ప్రజలకు ముక్కుముఖం తెలియని కేఎస్ఆర్ కు టికెట్ ఇస్తే ఊరుకునేది లేదన్నారు. తాండూరు టికెట్ ను ఎం.రమేష్ మహరాజుకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే బీసీలు అంతా తిరగబడి కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!