శివుడికి కృష్ణా జలాభిషేకం..!
– పాలమూరు నీళ్లతో తడిసిన స్వామి
– పాత కోటేశ్వర దేవాలయంలో పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో వెలసిన శ్రీ కోటేశ్వర దేవాలయంలోని శివుడికి కృష్ణా జలాలతో అభిషేకం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను పట్టణాలకు, గ్రామాలకు పంపించారు. ఈ క్రమంలో ఆదివారం పాత తాండూరులోని కోటేశ్వర దేవాలయంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమం చేపట్టారు. తాండూరు మున్సిపల్ అధికారులు, స్థానికులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి తెచ్చిన కృష్ణా జలాలతో స్థానిక పెద్దలు, భక్తులు కోటేశ్వర దేవాలయంలో వెలసిన శివునికి అభిషేకం చేశారు. అభిషేకం తరువాత శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణా జలాలను పాలమూరు-రంగారెడ్డి ద్వారా ఈ ప్రాంతాలకు నీరు తరలించేందుకు కృషి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగులు కృష్ణయ్య, నీరటి శ్రీనివాస్, స్థానికులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..

