కౌంటింగ్ కౌంట్ డౌన్..!
– రేపు ఎన్నికల ఓట్ల లెక్కింపు
– లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతుందంటే..?
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పోరు ముగిసింది. ఇక మిగిలింది కౌంటింగ్ ప్రక్రియ మిగిలింది. ఓట్ల లెక్కింపుకు కౌంట్ డౌన్ కూడా మొదలైంది. మరో 24 గంటల తరువాత గెలుపు, ఓటముల తీర్పుకు పులిస్టాప్ పడబోతుంది. వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల ఓట్ల లెక్కింపును పరిగిలోని వ్యవసాయ మార్కెట్ కమిటి గోదాంలో నిర్వహిస్తున్నారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపును ప్రారంభించబోతున్నారు.
ప్రక్రియ ఎలా జరగుతుందంటే..?
ఓట్ల లెక్కింపు నుంచి ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు బాధ్యత అంతా రిటర్నింగ్ అధికారి పైనే ఉంటుంది పార్టీ అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లు ఎలక్షన్ ఏజెంట్లను లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తారు రిటర్నింగ్ అధికారి. ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో 14 మందిని ఉంచకుండా కౌంటింగ్ ఏజెంట్లను అనుమతిస్తారు. ఈవీఎంలు ట్యాంపర్ కాలేదని దాని సీల్ సక్రమంగా ఉందని లెక్కింపు సిబ్బంది కౌంటింగ్ ఏజెంట్లు నిర్ధారించుకుంటారు. ఒకవేళ ఈవీఎంలు సక్రమంగా లేవని భావిస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ మీద బ్లూ పాయింట్ పెన్ ఫారం 17 సి లోని పార్ట్ 2 పేపర్ ఉంచాలి.
కౌంటింగ్ కు ముందు 17 సి ఫారం ఆధారంగా పోలైన ఓట్లు ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరి చూసుకుంటారు. వాటిని నోట్ చేసుకోవడంతో పాటు వివిధ పార్టీల ఏజెంట్లకు కూడా చూపించి వారి సంతకాలు తీసుకుంటారు. ఆ తర్వాత ఈవీఎంల సీన్లు తొలగించి రిజల్ట్ బటన్ నొక్కుతారు. అప్పుడు ఒక్కో అభ్యర్థికి ఆ ఈవీయంలో ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుస్తోంది. ఆ గణాంకాలను నోట్ చేసుకుంటారు. ఒక్కో రౌండ్ లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్డుపై రాసి ప్రకటిస్తారు. ఇలా ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్లు ఉంటారు.
ఈ లెక్కింపు ప్రక్రియ అంతా పార్టీల ప్రతినిధులు ఏజెంట్ల సమక్షంలోనే కొనసాగుతోంది. రౌండ్ ఫలితాన్ని వారు సంతృప్తి చెందిన తర్వాతే వెల్లడిస్తారు. ఎన్నికల సంఘం పరిశీలికుడు మాత్రమే కౌంటింగ్ కేంద్రం లోపల ఫోన్ వినియోగించుకోవడానికి అర్హులు.. మిగిలిన వారు ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ఇలా ఎన్నికల లెక్కింపును వీడియో తీసి వాటిని సీడీలలో భద్రపరుస్తారు. ఈ విధంగా భారీ భద్రత నడుమ కౌంటింగ్ కొనసాగనుంది.
ఇది కూడా చదవండి…

