దానిమ్మ జూస్.. చాలు..!
– కిడ్నీ, గుండె, మెదడు సమస్యలు పరార్
– చిన్నారులు, వృద్దులకు దివ్యౌషధం
దర్శిని డెస్క్: అలసటగా ఉన్నా… బలహీనంగా ఉన్నా.. దానిమ్మ జూస్ తాగాలని వైద్యులు, నిపుణులు సూచిస్తారు. మంచి చిట్కాగా ప్రియారిటీ ఇస్తారు. ఎందుకంటే దానిమ్మ, దాని జూస్ మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. దానిమ్మ గింజలు లేదా దానిమ్మ రసం రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. పిల్లలు, వృద్ధులు దానిమ్మ గింజలు నేరుగా తినలేరు. వారు రోజువారీ ఆహారంలో కనీసం ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ ఉండేలా చూసుకోవాలి. దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ రసాన్ని రోజూ తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని వివిధ అధ్యయనాలు వెల్లడించాయి.
మంచి ఉపయోగాలు ఇవే..
దానిమ్మలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాబట్టి దానిమ్మ రోజూ ఆహారంలో తీసుకుంటే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. దానిమ్మ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని వివిధ అధ్యయనాలు నిరూపించాయి. శారీరక బలహీనత, రక్తహీనతతో సహా వివిధ సమస్యలకు దానిమ్మ ఇంటి నివారిణిగా ఉపయోగబడుతుంది. ఇది రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఫలితంగా, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మెదడు కణాలను సజీవంగా ఉంచడంలో సహాయపడతాయి. దానిమ్మ తినడం వల్ల అల్జీమర్స్, పార్కిన్సన్స్ అవకాశాలను తగ్గిస్తుంది.
దానిమ్మ రసం మూత్రపిండాల్లో కాల్షియం, ఆక్సలేట్లు, ఫాస్ఫేట్ల సాంద్రతను పెంచుతుంది. దానిమ్మ రసాన్ని రోజూ తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. దానిమ్మలో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి పనితీరును మెరుగుపరుస్తాయి. అందుకే చాలా మంది క్రీడాకారులు వ్యాయామం తర్వాత అలసటను తగ్గించుకోవడానికి దానిమ్మ రసాన్ని తీసుకుంటారు. దానిమ్మ జ్యూస్ కండరాల సామర్థ్యాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. అందుకే పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు దానిమ్మ రసం తాగమని వైద్యులు సూచిస్తుంటారు. దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.
ఇది కూడా చదవండి…

