విద్యాశాఖ మంత్రి లోటు సిగ్గుచేటు..!
– విద్యా హక్కు చట్టాన్ని అమల్లోకి తేవాలి
– ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి
– తాండూరులో ఏబీవీపీ బంద్ విజయవంతం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లోటు సర్కారుకు సిగ్గుచేటని తాండూరు ఏబీవీపీ నాయకులు విమర్శించారు. బుధవారం ఏబీవీపీ నగర శాఖ అధ్యక్షులు నర్సింలు ఆధ్వర్యంలో తాండూరులో చేపట్టిన పాఠశాలల బంద్ విజయవంతం అయ్యింది. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు నర్సింలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికీ దాదాపు 6 నెలలు అవుతున్నా నేటికీ కూడా విద్యాశాఖ మంత్రి నీ నియమించకపోవటం సిగ్గుచేటు అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మార్పు రాకపోవడం బాధాకరమన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలు లక్షలకు లక్షలు ఫీజులు దండుకుంటున్న వైనం ఇవేవీ పట్టించుకోనటువంటి ప్రభుత్వం కేవలం చర్యలు తీసుకుంటామంటూ హామీలు ఇస్తూ చేతులు దులుపుకుంటుందని ఆరోపించారు.
అక్రమాలకు పాల్పడిన స్కూళ్లపై చర్యలు తీసుకుంటామంటూ, ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు తప్ప అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి నియామకం, విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమల్లోకి తీసుకరావాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పవన్, అజయ్, దినేష్, వంశీ, శ్రీకాంత్, చందు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

