బీసీ కులాల సంక్షేమానికి బీసీ కమీషన్ కృషి
– రాష్ట్ర కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్
– యాలాలలో బీసీల కులాల ఆధ్వర్యంలో సన్మానం
యాలాల, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ బీసీ కులాల సంక్షేమానికి కృషి చేస్తుందని రాష్ట్ర కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ పేర్కొన్నారు. ఆదివారం తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండల కేంద్రంలో ఉన్న నగరేశ్వర ఆలయంలో కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్‌కు కుల సంఘాల ఆధ్వర్యంలోఘన సన్మానం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు గాజుల బస్వరాజు సమక్షంలో బీసీ నాయకులు శుభప్రద్ పటేల్‌ను ఘనంగా
సన్మానించారు. ఈ సందర్భంగ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ బీసీ కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు. కుల వృత్తులన్నీ బీసీ వర్గాలే నిర్వహిస్తున్న నేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా కమిషన్ పని చేస్తోందని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో బీసీలు సోదరభావంతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్, పద్మశాలి, ముదిరాజ్, గౌడ, కుర్వ సంఘాల ప్రతినిధులు ఆకుల బస్వరాజ్, రవిందర్, బసంత్, నర్సింహులు గౌడ్, ఉపాధ్యాయులు మహేశ్, చంద్రశేఖర్, వీరేశం, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
