తాండూరు మండలంలో కాంగ్రెస్ పాదయాత్ర
– ప్రారంభించనున్న టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్
– ఏర్పాట్లు సిద్దం చేస్తున్న మండల పార్టీ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్రకు సిద్దమవుతోంది. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షులు, తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.రమేష్ మహారాజ్ ఈ పాదయాత్ర చేపట్టబోతున్నట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. రేపు ఆదివారం నుంచి 24వ తేది వరకు తాండూరు మండలంలో ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఇందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. రేపు ఆదివారం తాండూరు మండలంలోని కొత్లాపూర్ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఎం. రమేష్ మహారాజ్ పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభించనున్నారు. కొత్లాపూర్, మల్కాపూర్ పాదయాత్ర జరుగుతుందని నాయకులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా, ప్రభుత్వ వ్యతిరేక విధనాలపై పాదయాత్ర జరుగుతుందని నాయకులు పేర్కొన్నారు. ఈ పాదయాత్రలో నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
