బీపీని అదుపుచేసే కొబ్బరి నీళ్లు..!
– నియంత్రించడంలో దివ్య ఔషధం
– రోజుకో గ్లాసు తీసుకుంటే ప్రయోజనం
దర్శిని డెస్క్: అధిక రక్తపోటు(బీపీ) పెద్దల నుంచి యువత వరకు వేధిస్తున్న అనారోగ్య సమస్య. బీపీ నుంచి కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ప్రస్తుతం వేసవి కాలం సమీపిస్తుండడంతో బీపీ బాధితులు ఆందోళనకు గురవుతుంటారు. ఎందుకంటే వేసవిలో హైబీపీ సమస్య అధికంగా ఉంటుంది. అయితే వేసవిలో బీపీని అదుపు చేసుకునేందుకు కొబ్బరీ నీళ్లు దివ్య ఔషధంలా పనిచేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. రోజుకో గ్లాసు తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. ఆ ప్రయోజనాలేంటో మీరు తెలుసుకోంది.
సాధారణంగా అధిక రక్తపోటు ఉన్న రోగులలో సోడియం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో అధికంగా సోడియం గుండెపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల అధిక రక్తపోటు సమస్య వస్తుంది. అలాంటప్పుడు అధిక రక్తపోటు ఉన్నవారు కొబ్బరినీళ్లు తాగితే వారి శరీరంలోని అదనపు సోడియం తొలగిపోతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మీ సోడియం స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. హై బీపీ ఉన్నవారు రోజూ ఒక గ్లాసు కొబ్బరినీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లను తీసుకోండి.
కొబ్బరి నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. సాధారణంగా మనం తినే ఆహారం నుండి పొటాషియం లభిస్తుంది. వేసవిలో వీలైనంత ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగాలి. ఎందుకంటే పొటాషియం మూత్రం నుండి సోడియం, ఐరన్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు కొబ్బరినీళ్లు తాగితే బీపీని అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీరు రక్తనాళాలను శుభ్రపరచి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది రంధ్రాలను శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుదలను నివారిస్తుంది.
గమనిక: ఇది అవగాహన కోసం మాత్రమే అందించడం ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.
ఇది కూడా చదవండి…

