వివాహిత మహిళ అదృశ్యం

క్రైం తాండూరు వికారాబాద్

వివాహిత మహిళ అదృశ్యం
– పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
– కరణ్‌ కోట్ పోలీస్టేషన్‌లో కేసు నమోదు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : మనస్పర్థలో విసుగు చెంది ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ వివాహిత మహిళ అదృశ్యమైంది. భర్త పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో తాండూరు మండలంలోని కరణ్‌ కోట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామానికి చెందిన తిరుమల శ్రీనివాస్ తో గత కొన్నేళ్ల క్రితం శిరీష అనే మహిళతో వివాహాము జరిగింది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. శ్రీనివాస్ మేస్త్రీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్య, భర్తల మద్య గత కొన్నిరోజులుగా మనస్పర్థలు రావడంతో గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ఈనెల 5న శ్రీనివాస్ భార్య శిరీష ఇంటి నుంచి వెళ్లిపోయింది. వెళ్లే సమయంలో భర్త శ్రీనివాస్ వారించిన వినలేదు. ఆ రోజు నుంచి భర్త శ్రీనివాస్ బందువుల వద్ద, తెలిసిన వారి వద్ద విచారించిన శిరీష ఆచూకీ లభించలేదు. దీంతో భర్త శ్రీనివాస్ శనివారం కరణ్‌ కోట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి వెళ్లే సమయంలో భార్య శిరీష నీలం, నలుపు రంగు కలిగిన టాప్, చున్నీ, తెలుపు రంగు లెగ్గిన్ ధరించనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామానికి చెందిన శ్రీశైలం అనే వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!