ఓటింగ్‌కు రెడీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఓటింగ్‌కు రెడీ..!
– పార్లమెంట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
– ప్రశాంతంగా ఎన్నికల సామాగ్రి పంపిణీ
– 26 సెక్టార్లలో 1400 మంది ఎన్నికల సిబ్బంది
– 277లో 54 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
– వెల్లడించిన ఆర్డీఓ శ్రీనివాస్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు జరిగే పార్లమెంట్ పోలింగ్ కోసం తాండూరులో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆదివారం తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేపట్టారు. తాండూరు ఆర్డీఓ, ఎన్నికల సహాయ అధికారి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. తాండూరు నియోజకవర్గంలో 26 సెక్టార్లలో దాదాపు 1400ల మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు.

పీఓలు, ఏపీఓలు, బీఎల్వోలకు ఇదివరకే శిక్షణ పూర్తి చేశారు. తాండూరు నియోజకవర్గంలో మొత్తం 277 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. ఇందులో 54 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా లోకేషన్లు 17 ఉన్నాయని వెల్లడించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు చేశామన్నారు. అదేవిధంగా మొత్తం 2లక్షల 43 192 మంది ఉండగా ఇందులో పురుషులు 1లక్ష 17 వేల 821 మంది, మహిళలు 1లక్ష 25 వేల 364 మంది, 7మంది ట్రాన్‌ జెండర్లు ఉన్నారని వివరించారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు స్వచ్చందంగా హాజరై ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. మరోవైపు పోలింగ్ స్టేషన్ల వద్ద పోలీసు శాఖ నుంచి భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఇదికూడా చదవండి…

డియర్‌ ఓటర్‌..!