మందుబాబులకు పనిష్మెంట్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మందుబాబులకు పనిష్మెంట్..!
– రోగులకు పండ్ల పంపిణి చేయాలని శిక్ష
– తాండూరు న్యాయమూర్తి తీర్పు
– వెల్లడించిన టౌన్ సీఐ సంతోష్‌ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మందు సేవించి పట్టుబడిన నిందితులకు తాండూరు న్యాయస్థానం స్పెషల్ జ్యూడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ వినూత్న పనిష్మెంట్ ఇస్తూ తీర్పు వెలువరించారు. ఈ విషయాన్ని గురువారం తాండూరు పట్టణ సీఐ సంతోష కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో తాండూరు పట్టణం సాయిపూర్‌కు చెందిన పి.ఉదయ్, అభిజీత్‌, పరిగి మండలం గోవిందాపూర్‌కు చెందిన గుల్ల నగేష్‌, బషీరాబాద్‌ మండలం బహదూర్‌పూర్‌కు చెందిన రాజులు పట్టుబడ్డారు.

వీరిని గురువారం తాండూరు న్యాయస్థానంలో హాజరు పరచగా కేసు పూర్వాపరాలను పరిశీలించిన స్పెషల్ జ్యూడీషీయల్ న్యాయమూర్తి నామాల అశోక్ నిందితులకు వినూత్న శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించారు. నిందితులు రూ. 1000ల చొప్పున పండ్లు కొనుగోలు చేసి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగులకు పంపిణీ చేయాలని ఆదేశించినట్లు టౌన్‌ సీఐ సంతోష్‌ కుమార్ తెలిపారు. ఈ మేరకు నిందితులు దాదాపు 30 మందికి పండ్లు కొనుగోలు చేసి పంపిణీ చేశారని సీఐ వెల్లించారు. ఈ సందర్భంగా సీఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

కాంగ్రెస్ మాట బోగస్..!