అన్ని వార్డుల అభివృద్ధే ధ్యేయం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అన్ని వార్డుల అభివృద్ధే ధ్యేయం..!
– మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
– 13వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైన్‌ పనులు ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధి కృషి చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు.

శనివారం తాండూరు పట్టణం 13వ వార్డులో తాండూరు ఎమ్మెల్యే నిధులు రూ. 10లక్షలతో సీసీ రోడ్డు, రూ. 5లక్షలతో సైడ్ డ్రైన్‌ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి హాజరై పూజలు నిర్వహించి.. పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో 13వ వార్డులో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.

గతంలోనే రూ. 1కోటి రూపాయిలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని గుర్తుచేశారు. అదేవిధంగా గ్రీన్ సిటీ కాలనీ, మార్కెండే య కాలనీ, మిత్ర నగర్ తదితర కాలనీ లో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని వివరించారు. రానున్న రోజుల్లో కూడా ఎమ్మెల్యే సహాకారంతో పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తం రావు, కోకట్ గ్రామ సర్పంచ్ పబ్బన్ గారి రాజేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ నరేష్, డిఈ కృష్ణ, ఏఈ గౌతమ్, ఏపీ ఓ జనార్దన్, టి ఎ నీలకంఠం, ఎఫ్ ఎ రమేష్, మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, చంద్రా రెడ్డి, దివాకర్ రెడ్డి, కాలనీ వాసులు విజయమ్మ, లత, గోవిందా రావు, రాజు తదితరులు పాల్గొన్నారు.

బావనోళ్ల కుటుంబంలో విషాదం