జినుగుర్తికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాక

తాండూరు రాజకీయం వికారాబాద్

జినుగుర్తికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాక
– 30న తాండూరు మండలంలో పర్యటన
– ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం జినుగుర్తిలోని ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్‌లో ఈ నెల 30న కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పి. మహేందర్‌రెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్‌లో నిర్మించిన పలు అభివృద్ధి పనులను మంత్రులు ప్రారంభించనున్నారు. ఆడిటోరియం, ఓఎంజీసీ ట్రైనింగ్ ప్లాంట్, మట్టి పరీక్షల ప్రయోగశాల, గోశాల, ఫామ్ ప్రాజెక్టులు తదితర కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మంత్రుల పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కార్యక్రమాలను ఆర్ఎస్‌ఎస్ కార్యక్రమాల సదస్సు పర్యవేక్షకుడు పి. బాగయ్య పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొననున్నారు.

అరాచక ర్యాగింగ్..!