రేపు పాఠశాలల బంద్..!
– టీఆర్ఎస్ఎంఏ తాండూరు శాఖ నిర్ణయం
– జయప్రదం చేయాలని యజమాన్యాలకు పిలుపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరులో పాఠశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ఎంఏ తాండూరు శాఖ తెలిపింది.

గురువారం తాండూరు అధ్యక్షులు మోహన్ కృష్ణ గౌడ్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. నల్గొండలోని నాగార్జున హైస్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ పాఠశాలల బంద్ చేపట్టాలని రాష్ట్ర కమిటి పిలుపునిచ్చిందని అన్నారు. ఇందులో భాగంగా తాండూరులోని పాఠశాలల బంద్ చేపడుతున్నట్లు వెల్లడించారు.

శుక్రవారం నిరసనలో భాగంగా పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్లు ధరించి, రెండు నిమిషాలు మౌనం పాటించాలని, కొవ్వొత్తులతో నివాళులు అర్పించాలని విజ్ఞప్తి చేశారు. విద్యారంగానికి చెందిన రూపా రెడ్డి హత్య తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. విద్యావేత్తలకు భద్రత కల్పించాలని, హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

శుక్రవారం నాటి బంద్కు పాఠశాలల యజమాన్యాలు సంఘీభావం తెలిపి.. జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కీర్తి శర్మ, అభిలాష్ రెడ్డి, వహీద్, వెంకటేష్, సునీత, ఎం. రమేష్ గౌడ్, సోహీల్ ఉమ్రీ, ఇందూర్ రాములు, గోపాల్ నాయుడు, రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.


