రేపు ప్రైవేట్ స్కూల్స్ బంద్ పాటించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు ప్రైవేట్ స్కూల్స్ బంద్ పాటించాలి
– టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అఖీల్
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు ప్రైవేట్‌ స్కూళ్లు అన్ని బంద్ పాటించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్‌ ఫోరం(టీపీటీఎఫ్‌) వికారాబాద్‌ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అఖీల్ కోరారు.

నల్గొండలో ప్రిన్సిపాల్‌ రూపా రెడ్డి హత్యను నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ పాఠశాలల బంద్‌కు తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం పిలుపునిచ్చిదని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ షబ్బీర్‌ అలీ పిలుపు మేరకు వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా బంద్‌ పాటించాలని అఖీల్‌ కోరారు.

ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బంది భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పిల్లల ప్రవర్తన, స్నేహాలు, సోషల్‌ మీడియా వినియోగంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కుటుంబం, పాఠశాల, సమాజం కలిసి విద్యార్థుల్లో క్రమశిక్షణ, మానవతా విలువలను పెంపొందించాలని కోరారు.

రేపు పాఠశాలల బంద్‌..!