యాదాద్రి భక్తులకు శుభవార్త..!
– ఇక నుంచి ఆన్‌లైన్‌లో దర్శన టిక్కెట్లు
– ప్రత్యేక వెబ్ సైట్ తెచ్చిన దేవస్థానం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : యాదాద్రి పుణ్య క్షేత్రానికి వచ్చే భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. తిరుపతి తిరుమల దేవస్థానం తరహాలోనే యాదాద్రి నర్సన్న ఆలయంలో కూడా టికెట్లును ఆన్‌లైన్‌లో పొందే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం తర్వాత ఇలా వైకుంఠంగా పేరుందిన తిరుమల తరహాలో యాదాద్రిలో ఆలయనిర్మాణం, మాఢవీధులు, స్వామివారి పూజ కైంకర్యాలు, ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలు, ప్రసాదాలతో తెలంగాణ తిరుమలగా రూపుదిద్దుకుంది.
ఈ పుణ్యక్షేత్రానికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తరహాలో ఆన్‌లైన్ దర్శన టిక్కెట్ల సేవను అందుబాటులోకి తీసుకవచ్చింది. ఆన్‌లైన్‌లో ‘yadadritemple.telangana.gov.in ‘ వెబ్‌సైట్ ను సందర్శించి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక ఇదే వెబ్ సైట్ నుంచి ఈ హుండీ ద్వారా డొనేషన్స్ కూడా ఇవ్వవచ్చు. ఆన్ లైన్ బుకింగ్ ద్వారా గంట ముందు దర్శన, పూజ కైంకర్యాలకు బుకింగ్ చేసుకునే అవకాశం యాదగిరిగుట్ట దేవస్థానం కల్పించింది.

మరోవైపు వీఐపీ, వీవీఐపీ, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తుల సిఫార్సులపై వచ్చే భక్తులకు 300 రూపాయల టికెట్‌తో బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. రూ.150 చెల్లించి శీఘ్రదర్శనం ఆన్ లైన్ లో నమోదుకు అవకాశం ఉండగా, ప్రస్తుతం అన్ని సేవలను ఆన్ లైన్ అందుబాటులోకి దేవస్థానం తీసుకువచ్చింది.
ఎలా వినియోగించుకోవాంటే…?
ఆన్ లైన్ బుకింగ్ లో పేరు, గోత్రం, పూజ వివరాలు, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, తేదీ, ఎన్ని టికెట్లు, అడ్రస్, ఆధార్ నెంబర్, ఆలయ సందర్శన వేళ వంటి వివరాలు నింపాలి. ఆన్ లైన్ బుకింగ్, కౌంటర్ లో కంప్యూటరైజ్డ్ టికెట్లు పొందిన భక్తులకు తూర్పు రాజగోపురం వద్ద టికెట్లపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆలయంలో లోనికి అనుమతిస్తారన్నారని ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.

ఇదికూడా చదవండి…

